'Food Prayer | Brahmarpanam | Vedic Samskara'

06:11 May 31, 2022
'జీవ జాతి మనుగడకు  ప్రకృతి ద్వారా ఆహారాన్ని ప్రసాదిస్తున్న పరమేశ్వరునికి భోజనం చేయడానికి ముందు కృతజ్ఞతా పూర్వకంగా ధ్యానించే శ్లోకముల వివరణపై దృశ్య శ్రవణ రూపకము. సనాతన ధర్మ సారధి, ధార్మిక సేవా తత్పరులు  బ్రహ్మశ్రీ  శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు తమ రుషి పీఠంలో సనాతనమ్  శీర్షికన ప్రచురించిన \'\'అన్నంలో సూక్ష్మ శక్తులు\" స్ఫూర్తితో ధార్మికులకు సమర్పిస్తున్న చిరు పూజా పుష్పమ్.  గాన గంధర్వులు, సర్స్వతీ స్వరూపం శ్రీ పండితరాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారు గానం చేసిన అన్నపూర్ణాష్టకములోని శ్లోకములు \'\'అన్నపూర్ణే సదా పూర్ణే\'\' శ్రోతల పఠన, సాధన  సౌలభ్యం కోసం జత చేయబడినవి.  నాకు అవగాహన ఉన్నంత మేరకు కొద్దిపాటి విశ్లేషణ జోడించడమైనది. కలియుగంలో దేవదేవుని నామ సంకీర్తనయే ముక్తి మార్గమనేది రుషివాక్యం. మానవుడు చేసే ప్రతి పని ఒక యజ్ఞంగా భావించి చేయాలని  భగవానుడు గీతోపదేశం చేశారు. భగవత్ప్రసాదితమైన ఆహారం భుజించే టప్పుడు నారూ, నీరూ పోస్తున్న నారాయణునికి అంజలి ఘటించడం మన కనీస నైతిక కర్తవ్యం. అనాలోచితముగా దొర్లిన తప్పులను మన్నించమని మాన్యులకు మనవి. విధేయుడు డాక్టరు రామానంద శర్మ మంచిరాజు కాకినాడ 31.07.2020 శుక్రవారము #ManchiMata #SanathanaDharma #FoodPrayer #Brahmarpanam #SlokasForDailyChanting #VedaVidhi #Samskara' 

Tags: #ManchiMata , #SanathanaDharma , #FoodPrayer , #Brahmarpanam , #SlokasForDailyChanting , #VedaVidhi , #Samskara

See also:

comments